TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగుళూరు టెస్ట్.. భారత్ ఘన విజయం..

Published on: Tue Mar 7, 2017 2:12PM

 

బెంగుళూరు టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో భారత్ 188 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా.. వరుస వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులు మాత్రమే తీసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. కాగా ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్ 189, రెండో ఇన్నింగ్స్ 274
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 276, రెండో ఇన్నింగ్స్ 112