నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇండియా...
Published on: Tue Mar 7, 2017 9:34AM

టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 213/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా జట్టు భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తుంది. 82ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. పుజారా 87, రహానె 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇప్పటివరకు ఆసీస్‌పై 145పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.


