TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన టీమిండియా...

Published on: Mon Mar 6, 2017 9:56AM

 

టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఎట్టకేలకు టీమిండియా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. మూడో రోజున ఆస్ట్రేలియా జట్టు 276 పరుగులకు ఆలౌటై, తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. భారత బౌలర్లలో జడేజాకు 6 వికెట్లు దక్కగా, ఆశ్విన్ 2, ఇషాంత్ శర్మ, యాదవ్ లకు చెరో వికెట్ దక్కాయి.

 

ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ 33, రెన్షా 60, స్మిత్ 8, మార్ష్ 66, హ్యాండ్స్ కోంబ్ 16, మార్ష్ 0, వాడే 40, స్టార్స్ 26, ఓకీఫే 4, లయన్ 0, హాజిల్ వుడ్ 1 పరుగులు చేశారు.కాగా మరికాసేపట్లో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.