క‌రోనా నియంత్ర‌ణ‌కు భార‌త్ యాక్ష‌న్ ప్లాన్!

క‌రోనా తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని మార్చి 18 నుంచి ఆంక్ష‌లు విధిస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వ జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి ఉత్త‌ర్వుల‌ను విడుద‌ల చేసింది. మ‌రో వైపు కరోనా బారినపడి పంజాబ్‌లో ఓ వృద్ధుడు చనిపోయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. మృతుడి వయసు 68-70 వరకు ఉంటుందని సమాచారం. ఇటీవలే అతడు ఇటలీ నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. వైరస్ ప్రభావంతో చండీగఢ్ PGI ఆస్పత్రిలో చేరిన బాధితుడు.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు మరణించారు. మార్చి 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇండియాకు అంత‌ర్జాతీయ విమానాల రాక‌పై ఆంక్ష‌లు విధించారు. దేశంలోని స్కూళ్లను మార్చి 31 వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్ఈ బోర్డు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

భారత్‌లో ఇప్పటి వరకూ 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా.. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా వైరస్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. కోవిడ్- 19పై పోరాడేందుకు దేశమంతా సన్నద్ధం కావాలని సూచించారు. అలాగే కరోనా తర్వాతి దశపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, నిపుణులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

కరోనా భయాందోళనల నేపథ్యంలో భారత్ అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వ‌చ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 14 రోజులపాటు వారిని పరీక్షించి.. దగ్గు, జలుబు, జ్వరం లాంటి కరోనాల లక్షణాలు లేవని నిర్ధారించకున్న తర్వాతే ఇళ్లకు వెళ్లనిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వారిని ఐసోలేటెడ్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించడంతోపాటు వారు కలిసిన వారందరికీ పరీక్షలు చేయడంతోపాటు.. ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశంలోని 52 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకు అన్ని దేశాలకు వీసాలను రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. మన దేశంలో కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో వీసాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు అత్యవసరం అయితేనే విదేశాలకు వెళ్లాలని ప్రజలకు కేంద్రం సూచించింది. మంత్రులెవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని కేంద్రం స్పష్టం చేసింది.

పొరుగున మయన్మార్‌తో సరిహద్దులు మూసేసింది. రాకపోకలు అత్యధికంగా ఉండే నేపాల్ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ విధించారు. నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న చెక్ పాయింట్లను మూసివేసే దిశగా భారత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు కూడా తిరుమల దర్శనానికి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ల ద్వారా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను రద్దు చేసుకోవడానికి కూడా టీటీడీ అవకాశం కల్పిస్తోంది.

కేంద్ర‌ప్ర‌భుత్వ జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి ఆంక్ష‌ల్ని విధిస్తూ జారీ చేసిన ఉత్త‌ర్వులు మార్చి 18 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా మిగ‌తా వాటిపై ఆంక్ష‌ల్ని విధించారు. ఆర్థిక బ్యాంకింగ్ సేవలు, ఎటిఎం సేవలు, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో వుంటాయి. విద్యుత్, అగ్నిమాపక విభాగం అగ్నిమాపక కార్యకలాపాలు, పోర్ట్ / విమానాశ్రయం కార్యకలాపాలు, పోస్టల్ మరియు కొరియర్ సేవలు, జైలు / తాత్కాలిక నిర్బంధ కేంద్రం / డిపో / ఇమ్మిగ్రేషన్ /కారాగారం లో వేయడం, ఇంధన మరియు కందెనలు ఇంధన స్టేషన్లు పనిచేస్తాయి. ఉత్పత్తి, శుద్ధి, నిల్వ, సరఫరా మరియు పంపిణీ. ఆరోగ్య సేవలు ఆరోగ్య కార్యకలాపాలు / ఆసుపత్రి / క్లినిక్ / ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫార్మసీలు /సాంప్రదాయ మెడిసిన్ షాపులు /పశువైద్యుడు / డయాలసిస్ కేంద్రాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటాయి.

ప్రసారం మరియు టెలివిజన్ కార్యకలాపాలు మరియు సమాచారం వ్యాప్తిపై టెలికమ్యూనికేషన్స్ సేవలు, నీటి సేవల మరమ్మతులు / నిర్వహణ / కార్యకలాపాలు కార్యాచరణ, ప్రభుత్వ సేవలు / చట్టబద్ధమైన సంస్థలు, పబ్లిక్ ఏవియేషన్, కస్టమ్ ఎక్సైజ్, ఇమ్మిగ్రేషన్ మెరైన్, వాతావరణ సేవ‌లు అందుబాటులో వుంటాయి.

కిరాణా / చిన్న సరుకులకి /సూపర్మార్కెట్లు / పబ్లిక్ ఆపరేషన్లు అనుమతించబడ్డాయి. నైట్ మార్కెట్ / రైతు మార్కెట్ల‌పై, పూల్ / పబ్ / జిమ్ / బార్ / రెస్టారెంట్ / స్పా ప్రవేశంపై ఆంక్ష‌లు విధించారు. అలాగే మతం మతపరమైన సమావేశాలపై ఆంక్ష‌లు పెట్టారు. అంత్యక్రియల నిర్వహణ అనుమతించబడింది. క్లోజ్డ్ సమావేశాలు / ప్రదర్శనలు / కచేరీ /బస్కింగ్ / జుంబా / క్లబ్బులు / డిస్కో / బార్స్ /కచేరీలు / సినిమాస్ / కుటుంబం వినోద కేంద్రాలు / ఫన్ ఫెయిర్ /ఆర్కేడ్ మరియు క్లోజ్డ్ వివాహాలపై ఆంక్ష‌లు విధించారు. అలాగే విదేశీ సందర్శకుల ప్రవేశం అనుమతించబడదు.