TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చైనా ద్వంద వైఖరి-భారత్ నిస్సహాయత

Published on: Thu Sep 18, 2014 9:36PM

 

 

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో డిల్లీలో సమావేశమయినప్పుడు సరిహద్దు వద్ద చైనా దళాల చొరబాట్ల గురించి ప్రస్తావించి, అటువంటి వ్యవహారాలు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తీస్తాయని స్పష్టంగానే చెప్పినట్లు సమాచారం. ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు తగిన చర్యలు చేపడుతాము. సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే శక్తి ఉభయ దేశాలకు ఉందని పడికట్టు పదాలతో సమాధానం చెప్పారు తప్ప అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని కానీ, ప్రస్తుతం భారత్ లోకి చొచ్చుకు వచ్చి తిష్ట వేసిన తన దళాలను వెనక్కి పొమ్మని ఆదేశిస్తానని కానీ అయన హామీ ఇవ్వలేదు.

 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ సమీపంలో చుమ్మార్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన 600 చైనా సైనికులు ఇప్పటికీ ఇంకా అక్కడే తిష్టవేసుకొని కూర్చొని ఉన్నారు. వారికీ చైనా హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందూతూనే ఉన్నాయి. చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినా ఏమీ చేయలేని మన నిస్సహాయ స్థితికి బాధపడాలో లేక అదే చైనాతో డజనుకు పైగా ఒప్పందాలు కుదుర్చుకొన్నందుకు సంతోషించాలో తెలియని పరిస్థితి.