జిఎంఆర్ సంస్ధలపై ఐటి దాడులు
Published on: Sat Oct 13, 2012 11:08AM
.png)

ఇన్ కంటాక్స్ అధికారులు గత కొద్దికాలంగా అనేక కన్ స్ట్రకన్ కంపెనీలపై దాడులు నిర్వహిస్తూ వస్తుంది. అయితే అవన్నీ చిన్న చితకవే ఉన్నాయి. ఈ కంపెనీలు ఏ ఏ బ్యాంకుల్లో లోన్లు తీసు కున్నాయి రూణాలకు ఖర్చుకు ఎంతవరకు సరిపోయిందివర్కు ఎంత మేరకు జరిగింది అనేది కూడా చూస్తున్నాయి. అంతే కాక కంపెనీల వద్దనున్ననగదుని, టాక్సులను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. దీనికి అవసరమైతే ఉద్యోగుల దగ్గరనుండి కంపెనీ సెల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డు వేర్ ను కూడా వారు స్వాదీన పరుచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలను కట్టించిన జిఎంఆర్ సంస్ధ పై గురువారం అర్ధరాత్రినుండి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇవి ఇంకా రెండు మూడు రోజులు జరుగుతాయనుకుంటున్నారు. ఉద్యోగులంతా అధికారులకు సహకరిస్తున్నారు.


