TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్

Published on: Thu Apr 10, 2025 10:38AM

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

అంతటితో ఆగకుండా మాజీ సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు.  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే  వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పై వేటు ద్వారా స్పష్టంగా చాటింది.