TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐఎండీ రెడ్ నోటీస్.. అదనపు రుణానికి లాక్! ఏపీ పరువు తీసిన జగన్ సర్కార్.. 

Published on: Fri Nov 12, 2021 7:13PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అంధకారమేనా? ఏపీ ప్రజలకు గండమేనా? అంటే జగన్ రెడ్డి పాలనలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఏపీ పరిస్థితి ఏంటో అర్ధం కాని ఆందోళన నెలకొంది. జగన్ అస్తవ్యస్థ పాలనతో దేశంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ రెడ్‌ నోటీసులను జారీ చేసింది. మెడికల్‌ ఉపకరణాలను ఏపీకి సరఫరా చేయవద్దని  ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీఎంఎస్‌ఐడీసీకి పరికరాలు ఎవరు సరఫరా చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది ఐఎండీ. నాలుగు సంవత్సరాల నుంచి తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని  సమాఖ్య తెలిపింది. సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేదని సమాఖ్య పేర్కొంది. ఎవరైన సరఫరా చేస్తే వారి సొంత రిస్క్‌ అని నోటీస్‌లో సమాఖ్య వివరించింది. ఏపీ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేసింది. వంద శాతం డబ్బు చెల్లిస్తేనే పరికరాలు సరఫరా చేయాలని పరిశ్రమలకు సూచించింది. ప్రభుత్వ తీరుపై వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఐఎండీ షాక్ ఇచ్చిన రోజే జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో ఝలక్ తగిలింది. అదనపు రుణం అర్హతను ఏపీ కోల్పోయింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ వెనకబడింది. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో ఏపీ వెనకబడటంతో అదనపు రుణాన్ని ఏపీ పొందలేకపోయింది.  రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంకు అదనంగా 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.5,392 కోట్ల అదనపు రుణం పొందేందుకు అర్హత సాధించింది. తెలంగాణ తరవాత రూ. 2,869 కోట్లతో పంజాబ్‌ రెండోస్థానంలో ఉంది. అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ,  రాజస్థాన్ ఉన్నాయి.