TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో విచ్చల విడిగా కల్తీ కల్లు, సారా, మద్యం అమ్మకాలు

Published on: Sun Aug 5, 2012 7:17AM

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ మద్యం, కల్తీసారా, కల్తీకల్లు అమ్మకాలు యథేశ్ఛగా సాగుతున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆబ్కారీ(ఎక్సయిజ్‌) శాఖ అసలు శాంపిల్స్‌ సేకరించకుండా వ్యాపారులకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వటం వల్లే ఈ పరిస్ధితి ఏర్పడిరది. ఈ శాఖ తన ల్యాబ్‌లను విస్తరించినా దాడులు చేసి శ్యాంపిల్స్‌ సేకరణలో ఉదాసీనత చూపుతోందన్నది ప్రస్తుత పరిస్థితులను అథ్యయనం చేస్తే వెలుగులోకి వచ్చిన విషయం. ట్రైన్డ్‌ ల్యాబ్‌ సిబ్బంది ఉన్నా ఎందుకు ఈ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటే పలురకాల అంశాలు తెరపైకి వచ్చాయి. మొదటి అంశంగా ఆమ్యామ్యాల పంపిణీ సక్రమంగా జరగలేదనిపిస్తేనే ఆబ్కారీసిబ్బంది దాడులతో విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. అప్పుడు కూడా బ్రాందీషాపుల్లో ఉన్న కల్తీ వదిలేసి సారాపైన నిఘా వేస్తున్నారట.

 

అదే సారా కల్తీపై కసరత్తు చేస్తే కల్లు గురించి అస్సలు పట్టించు కోవటం లేదట. కోట్లకు పడగలెత్తిన ధనవంతులైతే వారి జోలికి ఆబ్కారీ వెళ్లాల్సిన పని లేకుండా స్వచ్ఛమైన సరుకు శాంపిల్స్‌ శాఖే ముందుగా సిద్ధం చేస్తోందట. ఇలా తనకు వచ్చే లాభం ఆధారంగా దాడులు శ్యాంపిల్స్‌ సేకరిస్తున్నారని, ప్రత్యేకించి కేసులు పెట్టడమే టార్గెట్‌ అయ్యే సమయంలోనే దాడులపై దృష్టిసారిస్తున్నారని సమాచారం. ప్రత్యేకించి మద్యం, సారా, కల్లు మూడిరటిపైనా సమదృష్టితో కల్తీని నివారించేందుకు శాఖపరమైన కసరత్తులు ఏమీ చేయట్లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ మూడిరటిపైనా స్పష్టమైన వైఖరితో ఆబ్కారీ వ్యవహరించినంతవరకూ కల్తీ తాగుబోతుల ప్రాణాలు తీస్తూనే ఉంటుంది. తాజాగా మెదక్‌జిల్లా మిరుదొడ్డి మండలం చేప్యాలలో కల్తీకల్లు తాగి 15మంది అస్వస్తతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు నెలల క్రితం కల్తీసారా తాగి తూర్పుగోదావరి జిల్లాలో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. అలానే ఇక్కడ అన్ని బ్రాండ్‌ల మద్యం తాజాగా కల్తీ అయి అమ్మకం జరుగుతోందన్న ఆరోపణలూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలోనూ కల్తీమద్యం, సారాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. ఏదేమైనా కల్తీల నివారణకు కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆబ్కారీ గుర్తించాలని పలువురు కోరుతున్నారు.