అక్రమనిల్వలతో పప్పుధాన్యాల ధర పెంచుతున్న వ్యాపారులు?
Published on: Sat Oct 20, 2012 11:02AM

అక్రమంగా పప్పుధాన్యాలను నిల్వ చేసి వాటి ధర పెరగటానికి వ్యాపారులు కారణమవుతున్నారు. డిమాండు`సప్లయ్ సూత్రాన్ని తలకిందులు చేసి తమ వ్యాపారంలో ప్రజాప్రయోజనాల పాళ్లు తగ్గిస్తున్నారు. స్వార్ధంతో లాభాలు పెంచుకునేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలకు సివిల్‌సప్లయ్‌శాఖ చాలినంత సహకారం అందిస్తోంది. అధికారులు మారినప్పుడు మాత్రం వీరు ఈ నిల్వల గురించి మరిచిపోతుంటారు. అప్పుడే వచ్చిన అధికారులు తమ గుర్తింపుకోసం విజిలెన్స్ దుమ్ము వదులుస్తారు. దీంతో వీరు దాడులు చేసి నిల్వలను గుర్తిస్తారు. వ్యాపారులపై ఆ సమయంలో కేసులు కూడా నమోదు చేస్తారు. ఇదంతా ఓ సినీఫక్కీలో జరుగుతున్న సామాన్యపరిశీలకులు సైతం అంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా కంచికచర్ల ఉదంతం దీనికి అద్దం పడుతోంది. దాదాపు 2కోట్ల రూపాయల విలువైన పప్పుధాన్యాలను నిల్వ చేసి వ్యాపారులు దాడిలో అడ్డంగా దొరికిపోయారు.


