అయ్యప్ప సొసైటీలో ఆ ఇళ్లను వదిలేస్తారా?

 

 

 

అయ్యప్ప సొసైటీలో గురుకుల ట్రస్ట్ భూముల విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అయ్యప్ప సొసైటీలో పేదల ఇళ్లను కూల్చివేసి, ధనవంతుల ఇళ్లను వదిలివేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. 625 ఎకరాలలో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసి.. ఆ భూమిని పేదలకు పంచాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. గురుకుల ట్రస్ట్ భూములను, సెజ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.