TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి డి.ఎల్. అక్రమ సంపాదన రూ.2000 కోట్లా?

Published on: Mon May 7, 2012 10:02AM

మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి తన అవినీతిని నిరూపిస్తే గుండు కొట్టించుకుంటానంటున్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, రవీంద్రారెడ్డి దాదాపు రెండువేల రూపాయలు సంపాదించారని వరదరాజులరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోనే వందకోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారో డి.ఎల్. చెప్పాలని వరదరాజులరెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపనికీ చేయి చాచే తత్వమున్న రవీంద్రారెడ్డి ఇతరుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని విమర్శించారు. రుపాకుల లైసెన్సులకు డబ్బులు వసూలు చేసే జిల్లా అధికారిని కాపాడిన ఘనత కూడా మంత్రి డి.ఎల్.దేనని వరదరాజులరెడ్డి ఆరోపించారు.

 

 

ఒక దొంగ ఇతరులను చూసి దొంగా ... దొంగా ... అని అరిచినట్లు డి.ఎల్. తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే మంత్రి డి.ఎల్. మాత్రం ఏమీ చేయగలిగారనీ, ఆ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ పరిస్థితి మంత్రి అంచనా వేసుకోవాలని వరదరాజులరెడ్డి హితవు పలికారు. తాను అవినీతిపరుడని నిరూపించాగలిగితే వెంటనే గుండు కొట్టించుకుంటానని వరదరాజులరెడ్డి బల్ల గుద్ది మరీ సవాల్ చేస్తున్నారు.