కమల్‌హాసన్‌కి స్వల్ప అస్వస్థ ఆస్పత్రిలో చేరిక...
Published on: Tue Sep 16, 2014 2:18PM

నటుడు, దర్శకుడు, రచయిత కమల్‌హాసన్ ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల్ హాసన్ వయసు 59 సంవత్సరాలు. కమల్ హాసన్ ఇంకా రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే వుండాలని వైద్యులు చెబుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని ఇప్పుడు ఆయన కోలుకున్నారని వైద్యులు చెబుతున్నారు. కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారన్న పుకార్లు వ్యాపించాయి. వాటిని వైద్యులు ఖండిస్తున్నారు.


