వయసెక్కువ మగాళ్ళ౦టే ఇష్టం: ఇలియానా
Published on: Tue Dec 4, 2012 11:09AM

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వలస వెళ్ళిన ఇలియానాకి అక్కడి కల్చర్ బాగానే అలవాటైంది. తాను వయసెక్కువ మగవాళ్ల పట్ల తను ఎట్రాక్ట్ అవుతుంటానని ఈ గోవా బ్యూటీ తేల్చి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..."కొంచెం వయసెక్కువ మగవాళ్లతో నేను కనెక్టవుతుంటాను. దీనికి కారణం నేనున్న వృత్తి వల్లేనని నా అభిప్రాయం'' అంది.
అలా ఎట్రాక్ట్ అవటానికి కారణం చెప్తూ..."సినీ రంగంలోని ఆడవాళ్లు చిన్న వయసులోనే బాగా ఎక్స్ పోజ్ అవుతుంటారు. అందువల్ల చాలా వేగంగా వారు పరిణతి చెందుతారు. మా అమ్మానాన్నల మధ్య వయసు తేడా పన్నెండేళ్లు. అలాగే మా అక్కా బావల మధ్య వయసు తారతమ్యం పదేళ్లు. ప్రేమలో పడ్డాక, వయసనేది పెద్ద విషయం కాదు'' అని చెప్పింది ఇలియానా.


