TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ పరిస్థితికి కారణం తనే అంటున్న ఇలియానా

Published on: Mon Aug 3, 2015 1:19PM

 

గోవా భామ ఇల్లీ భామ దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నడుము సోయగాలతో కుర్రకారును మత్తెక్కించి టాప్ పొజిషన్ దక్కించుకుంది. టాలీవుడ్ లో మొట్టమొదట అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నభామ కూడా ఈ గోవా బ్యూటీనే. అయితే గత కొంత కాలంగా ఈ అమ్మడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. బర్ఫీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానాకి ఆసినిమా విజయం సాధించిన తరువాత ఇంకేముంది టాలీవుడ్ నుండి పాగా ఎత్తేసి.. బాలీవుడ్ లో కూడా దున్నేయెచ్చు అనుకుంది. కానీ బర్ఫీ సినిమా తరువాత రెండు మూడు సినిమాలు చేసిన తరువాత ఆఫర్లు కరువయ్యాయి. అయితే ఇప్పుడు ఈఅమ్మడు తన ఈ పరిస్థితి కారణం తనే అంటుంది. బర్ఫీ విజయం తరువాత చాలా ఆపర్లు రావల్సింది కానీ బాలీవుడ్ కి కొత్త కావడం వల్ల ఆసినిమా విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను.. ఆ విషయంలో తప్పు నాదే.. ఇప్పటి నా పరిస్థితికి నేనే కారణం అంటూ బాధ వెల్లకక్కిందట. పాపం ఉన్నదీ పోయింది.. ఉంచుకున్నదీ పోయింది అన్నట్టు ఉంది ఇలియానా పరిస్థితి.