TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందరికీ కొవిడ్‌ పరీక్షలు అవసరం లేదు.. ఐసీఎంఆర్ క్లారిటీ

Published on: Tue Jan 11, 2022 1:41PM

దేశంలో కొవిడ్ కేసులు మరోమారు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో, జనంలో మళ్ళీ మరోమారు భయందోళనలు మొదలయ్యాయి. కరోనా లక్షణాలు అంతగా కనిపించకపోయినా, కీడెంచి మేలెంచమన్నారని కావచ్చు ఎందుకైనా మంచిదని పరీక్షలకు పరుగులు తీస్తున్నారు. అయితే, ఆ కోవిడ్ లక్షణాలు లేని వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది.

కొవిడ్‌ నిర్ధారితులకు సన్నిహితంగా మెలిగిన- కాంటాక్ట్స్, అందరూ కూడ పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదని, వయసు, దీర్ఘ కాల అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత సమస్యలుగల హైరిస్క్‌ కేటగిరీకి చెందినవారు మాత్రం తప్పక పరీక్షలు చేయించుకోవాలని ఐసీఎంఆర్‌ పేర్కొంది. కరోనా పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్‌ సోమవారం తాజా మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వ్యక్తులు, హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, కేంద్ర ప్రభుత్వం సవరించిన నిబంధనల మేరకు కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు...కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తాజాగా పేర్కొంది.వీరికి పరీక్షలు తప్పనిసరి...

దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు, శ్వాస సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు..కొవిడ్‌ నిర్ధారితులకు సన్నిహితంగా మెలిగిన వారిలో 60 ఏళ్లకు పైగా వయసు ఉండి, మధుమేహం, బీపీ, దీర్ఘకాలంగా ఊపిరితిత్తులు, కిడ్నీ, కేన్సర్, స్థూలకాయం సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు.అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు, విదేశాల నుంచి భారత్‌కు విమానాలు, నౌకల ద్వారా వచ్చే వారు..ఆసుపత్రుల్లో చేరిన వారు వైద్యుల సూచన మేరకే పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. .

హోం, సెల్ఫ్, ర్యాట్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఒకవేళ నెగెటివ్‌ వచ్చినప్పటికీ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొనేలా చూడాలని సూచించింది.ఈ కిట్లు ఉపయోగించవచ్చుకరోనా నిర్ధారణ పరీక్షలను ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్, సీఆర్‌ఐఎస్‌పీఆర్, ఆర్‌టీ-ల్యాంప్, ర్యాపిడ్‌ మాలిక్యులర్‌ టెస్టింగ్‌ సిస్టమ్స్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా నిర్వహించవచ్చని తెలిపింది.కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చే వారి టీకా పరిస్థితి గురించి తప్పనిసరిగా నమోదుచేయాలని, ఈ సమాచారం అత్యవసరమని ఐసీఎంఆర్‌ పేర్కొంది.