Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యార్కర్ సంధించాడంటే వికెట్ విరిగిపోవాల్సిందే.. ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బుమ్రా
posted on: Jan 28, 2025 8:50AM

దిగ్గజ క్రికెటర్లను వెనక్కు నెట్టి మరీ 2024 సంవత్సరానికి ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా నిలిచారు. గత ఏడాది టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బుమ్రానే ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం(జనవరి 27) విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐసీపీఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్, శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌లను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని అందుకున్నాడని పేర్కొంది.

కాగా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆరో ఇండయన్ క్రికెటర్ గా బుమ్రా నిలిచారు. బుమ్రాకు ముందు ఈ అవార్డును 2004లో రాహుల్ ద్రావిడ్, 2009లో గౌతమ్ గంభీర్, 2010లో వీరేంద్ర సెహ్వాగ్, 2016లో అశ్విన్ , 2018లో విరాట్ కోహ్లీ అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లోనూ బుమ్రాకు చోటుదక్కిన సంగతి తెలిసిందే. 2024 ఏడాది మొత్తం బుమ్రా అసమాన్య ప్రతిభ కనబరిచారు. ఏడాది మొత్తంలో 13 టెస్టులు ఆడిన బుమ్రా మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డులకు ఎక్కడా. ఇక గత ఏడాది చివరిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తం 32 వికెట్లు పడగొట్టారు. సొంత గడ్డపైనా, విదేశీ గడ్డపైనా కూడా అత్యద్భుతంగా ఆడిన బుమ్రా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఘనత సాధించిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
.webp)
ఇలా ఉండగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయంతో వైదొలగిన బుమ్రా ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా కోలుకుంటే టీమ్ ఇండియాకు తిరుగుండదు. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. ఇక మ్యాచ్ లలో ఆడటం అన్నది అతని ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది.


.webp)



