మళ్లీ పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి?
Published on: Mon Dec 1, 2025 9:50AM
.webp)
ఐ బొమ్మ రవిని పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకోనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. తీవ్ర సంచలనం సృష్టించిన పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ పై సోమవారం (డిసెంబర్ 1)నాంపల్లి కోర్టులో విచారణ జరగుతుంది. సరిగ్గా అదే సమయంలో మరో మూడు కేసులలో పోలీసులు రవిని ఇదే కోర్టులో హాజరు పరచనున్నారు.
ఐప్పటికే ఐబొమ్మ రవిని ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మూడు కేసులలో రవిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసలు, ఆ మూడు కేసులలోనూ విచారణకు మరోమారు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. అందుకు కోర్టు అనుమతి ఇస్తే మరో మారు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.


