నెహ్రూని పొగిడాడు.. బదిలీ అయ్యాడు..

 

నెహ్రూని పొగిడిన ఐఏఎస్ ఆపీసర్ కి దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మధ్యప్రదేశ్ లోని బర్వానీలో అజయ్ సింగ్ గంగ్వార్ అనే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈయన నెహ్రూని పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇక అంతే ఆ పోస్ట్ వైరల్ గా మారి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లింది. అంతేకాదు.. దీనిపై బీజేపీ నేత వివ్ఆస్ సారంగ్  స్పందించి.. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వాన్ని, వ్యవస్థను టార్గెట్ చేస్తూ అజయ్ గంగ్వార్ పేరు ఉందని ఆరోపించారు. దీంతో కేంద్రం ఒక పదవిలో ఉన్న అధికారులు.. రాజకీయ అంశాలపై కామెంట్లు చేయరాదన్న విషయాన్ని మరచిపోయి.. ఆ నిబంధనను ఉల్లంఘించినందుకుగాను ఆయనను అక్కడి నుండి బదిలీ చేశారు. కాగా అజయ్ సింగ్ గంగ్వార్ చేసిన పోస్ట్..

 

”నెహ్రూ చేసిన తప్పులను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 1947 తరువాత మనం హిందూ తాలిబన్‌ రాష్ట్రం కాకుండా నెహ్రూ అడ్డుపడ్డారు. ఇది ఆయన చేసిన తప్పా? ఐఐటిలు, ఇస్రో, బిఎఆర్‌సి, బిహెచ్‌ఇఎల్‌, స్టీల్‌ ప్లాంట్లు, డ్యామ్‌లు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు మొదలైనవి స్థాపించారు.. ఇది నేరమా? విక్రమ్‌ సారాభాయ్‌, హోమిభాభా వంటివారిని సత్కరించారు, రామ్‌దేవ్‌, ఆశారామ్‌ వంటి ‘మేధావుల’ను కాదు..” అంటూ అజయ్‌సింగ్‌ గంగ్వార్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

 

 

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం బీజేపీ అజయ్ సింగ్ గంగ్వార్ పై వ్యవహరించిన తీరుపై మండిపడుతోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు దేశంలో అసహనం ఉందనడానికి.. స్వాతంత్ర్య సమరయోధుడిని పొగడటం కూడా తప్పేనా అని ప్రశ్నించింది.