IAS అధికారిణి మీద లైంగిక వేధింపులు

 

ఆమె సాక్షాత్తు ఓ ఐఏఎస్‌ అధికారిణి. ప్రజల్ని రక్షించేందుకు ఆమెకు ప్రభుత్వం కావల్సినన్ని అధికారాలు అందిస్తుంది. కానీ ఆ అధికారికే రక్షణ లేకపోతే. తను చెప్పినట్లుగా నడుచుకోవడం లేదంటూ, ఆమె పై అధికారి ఆమెని వేధిస్తుంటే. మహిళ కదా అన్న దరుసుతనంతో లైంగికంగా లోబరచుకునేందుకు ప్రయత్నిస్తుంటే... ఎవరితో చెప్పుకోవాలి. అందుకే హర్యానాకు చెందిన ఆ అధికారిణి సోషల్ మీడియాను ఆశ్రయించింది. అతని వేధింపులకి తగిన సాక్ష్యాలు జోడించి ప్రభుత్వ ఛీఫ్ సెక్రెటరీకి పంపించింది. మీరు ఊహించింది నిజమే! ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరి సామాన్యుల పరిస్థతి ఏమిటి!