TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ సీపీగా సజ్జనార్

Published on: Sat Sep 27, 2025 10:43AM

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదలీ చేసింది. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించింది.   అగ్నిమాపక శాఖ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా బదలీ చేసింది. ప్రస్తతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ ను హైదరాబాద్ సీపీగా నియమించింది. అలాగే హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేసింది. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‎గా హరిత నియమితులయ్యారు.  

ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌ , జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ,  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్,  గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్,  పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,   ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్‌,  హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్,  వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్,   సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్,   నారాయణ పేట్ ఎస్పీగా వినీత్‌‌,  ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్,  మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్,  ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధలు నియమితులయ్యారు.