బెయిల్ రద్దుపై సుప్రీంకు ఐఏఎస్ శ్రీలక్ష్మి
Published on: Wed Jan 4, 2012 7:49AM
న్యూ
ఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో తన బెయిల్ రద్దుపై ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సుప్రీంకోర్టుకెక్కారు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈనెల 2వ తేదీన హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మంగళవారం శ్రీలక్ష్మీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ బుధవారం జరగనున్నట్లు తెలుస్తోంది, ఓఎంసీ అనుమతుల విషయంలో తాను ఏ తప్పు చేయలేదంటూ ఆ పిటిషన్‌లో ఆమె మూడు కారణాలను తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున, తాను మహిళను అయినందున తనకు బెయిల్ కొనసాగించాలని, సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, ఏ తప్పు చేయలేదు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంలేదని ఆమె చెప్పుకున్నారు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి తరఫున వాదించిన న్యాయవాదులే శ్రీలక్ష్మి కేసును వాదించడం విశేషం.


