లగడపాటి అన్న చీకటి ఒప్పందాలు ఏమిటి?

 

 

 

విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ తమ రాజీనామాలను ఆమోదింప చేసుకున్న తర్వాత కొన్ని చీకటి ఒప్పందాలను బయటపెడతానంటున్నారు. రాజీనామా ఆమోదించుకునేందుకు ఈ నెల 24న స్పీకర్ వద్ద అపాయింట్ మెంట్ తీసుకుంటే స్పీకర్ అందుబాటులోకి రాలేదు. వచ్చే నెల 2న కలవాలని చెప్పారు. దీంతో రాజీనామాల ఆమోదం కోసం చూస్తున్నారు.

 

జగన్ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందా ? అని లగడపాటిని అడిగితే ఏమో చాలా మంది చాలా మాటలు అంటున్నారు. కానీ నా రాజీనామా ఆమోదం పొందితే నాకు తెలిసిన విషయాలు బయటపెడతా అని అంటున్నారు. అంటే సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ లపైనే ఈయన ఆరోపణ చేస్తారా? లేక ఇంకేమైనా కొత్త విషయం చెబుతారా?అన్నది చూడాలి.