ప్రకాష్ రాజ్ మూడు నెలలేనంట ఉండేది

 

లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ...స్వతంత్ర అభ్యర్తిగానే పోటీచేస్తానని, రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.‌ ఒకవేళ ఏ రాజకీయ పార్టీలో చేరినా మూడు నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేనని అన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలేవీ నిజాయితీగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలో తెలుసని, కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని అన్నారు. బీజేపీ పార్టీ అనేది నీతిలేని వ్యక్తులతో కూడిన సమూహమని ప్రకాశ్‌రాజ్‌ విమర్శించారు. వారు గోమాతను పూజిస్తామని చెప్పుకొంటారని, కానీ గోవుల్ని పూజిస్తూ జరుపుకొనే మకర సంక్రాంతి రోజున మాత్రం ఇళ్లల్లో ఉండకుండా క్యాంప్‌లకు పోతారని ఎద్దేవా చేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూటమిగా ఏర్పడిన మహాగత్‌బంధన్‌ గురించి తనకు అవగాహన లేదని అన్నారు.