TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభాస్ ఎవడో నాకు తెలియదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

Published on: Fri Nov 22, 2024 12:05PM

వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు. పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి. 

జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తన సైతాన్ సైన్యం చేత విష ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించారు. ప్రభాస్ తో తనకు ఏవో సంబంధాలు ఉన్నాయని కొన్ని యూట్యూబ్ చానల్స్ చేత విష ప్రచారం చేయించింది జగన్ కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభాస్ తో ఏనాడు పర్సనల్ గా కలిసింది లేదు. జగన్ కు ఈ విషయం తెలుసు. చెల్లెలు మీద విష ప్రచారం జరుగుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడని షర్మిల ప్రశ్నించారు.  నా అన్న జగన్ తన సైతాన్ సైన్యం చేత ప్రచారం చేయించాడన్నారు. చెల్లెలు మీద జుగుప్సాకర ప్రచారం చేయడం, తల్లి మీద కేసు బనాయించడం, తండ్రి పేరును సిబిఐ చార్జిషీట్ లో ఇరికించడం జగన్ కే చెల్లిందన్నారు. 


అప్పట్లో వివి వినాయక్ దర్శకత్వంలో యోగి చిత్రాన్ని షర్మిల మేనమామ  రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించారు. అప్పటి నుంచి షర్మిల, ప్రభాస్ మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో  ఈ వీడియోలు చక్కర్లు కొడుతుండటపై షర్మిల  తీవ్ర మనస్థాపం చెంది కేసు బనాయించారు.  వీడియోలను డిలీట్ చేయించారు. తాజాగా తనకుప్రభాస్ తో ఉన్న సంబంధంపై క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.