తెలంగాణ దిశ దశ మార్చేందుకు వస్తున్నాను
Published on: Tue Nov 19, 2024 1:59PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వెళ్లారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరినట్టు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘‘తెలంగాణ చైతన్యపు రాజధాని... కాళోజీ నుంచి పివి వరకు.. మహానీయులను తీర్చిదిద్దిన నేల.. స్వరాష్ట్ర సిద్దాంతకర్త జయశంకర్ సార్ కు జన్మనిచ్చిన గడ్డ... హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్కక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతం.. దోపిడికి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ద క్షేత్రం వరంగల్. వీరందరి స్పూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దిశ దశ మార్చేందుకు నేడు వస్తున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు.


