నేనొక కూలీని: చంద్రబాబు
Published on: Sat Jul 12, 2014 6:58PM
.jpg)
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను తాను ఒక కూలీగా అభివర్ణించుకున్నారు. ఏపీ ఎన్జీవోలు తనను సత్కరించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మాణం చేయాల్సిన అవసరముందని అందుకోసం ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి తాను ఒక కూలీలాగా పనిచేస్తానని ఆయన అన్నారు.


