TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి  హైడ్రా నోటీసులు

Published on: Thu Aug 29, 2024 10:32AM

చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టానికి కళ్లు లేవు  , చట్టానికి చుట్టాలు లేరు అనేవి సినిమాల్లో వినిపించే సర్వసాధారణ డైలాగ్స్. గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతల కార్యక్రమం కేవలం ప్రతిపక్ష నేతలను దృష్టిలో పెట్టుకుని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. హైదరాబాద్  చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన కూల్చివేతల కార్యక్రమంలో తన కుటుంబసభ్యులు ఉన్నా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ సందర్భం రానే వచ్చింది. దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టిన 204 ఇళ్లకు జీహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసింది. 204 ఇళ్లకు నోటీసులు రావడం పెద్ద వార్త కాదు . కానీ ఈ ఇళ్లలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వడం పెద్ద వార్త అయ్యింది. దుర్గం చెరువు పరివాహక ప్రాంత వాసులు భయంతో వణికి పోతున్నారు.  మాదాపూర్, అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు రావడంతో  వారి భయం మరింత పెరిగింది. ఈ సొసైటీ పలువురు సినీ రాజకీయ నేతలకు స్థలాలను  గతంలో విక్రయించింది. వీరిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఉన్నారు. సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయంతో రేవంత్ సర్కార్ మీద భరోసా పెరిగింది. కాంగ్రెస్ బద్ద శత్రువు అయిన బిజెపి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ పార్టీ నేత రఘునందన్ రావు ప్రముఖ న్యాయవాది. హైడ్రా విషయంలో ప్రభుత్వం తరపున వాదనలు  వినిపిస్తానని ఇంతకుమునుపే ప్రకటించారు.