యు.టి. ఎందుకు వద్దంటే..!

 

 

 

హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని, హైదరాబాద్ యు.టి. ప్రతిపాదనకి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని విభజనవాదులు విరుచుకుపడుతున్నారు. యు.టి. పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఇంతకీ విభజనవాదులు యు.టి.ని ఎందుకు వద్దంటున్నారంటే...

1. హైదరాబాద్ మాదే అని పోజులు కొట్టడానికి వీలుండదు.

2. హైదరాబాద్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో వుంటుంది కాబట్టి లోకల్ రాజకీయ నాయకుల ఆటలు చెల్లవు.

3. హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు న్యాయమైన వాటా దక్కుతుంది.

4. స్థానికంగా వుండే రాజకీయ నాయకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి. హైదరాబాద్‌ని      ఉద్ధరించేస్తామని చెబుతున్నవాళ్ళకి ఆ ఛాన్స్ వుండదు.

5. సీమాంధ్రులను హింసించడానికి వీలుండదు. భయభ్రాంతులను చేయడానికి అవకాశం వుండదు. వాళ్ళని హైదరాబాద్ నుంచి తరిమేస్తాం అనడానికి కూడా ఛాన్స్ వుండదు.
 

6. పదేళ్ళ తర్వాత యు.టి. శాశ్వతంగా కంటిన్యూ అయ్యే అవకాశం వుంది.

7. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆస్తులపై దాడులు చేయడానికి వీలుండదు.

8. సీమాంధ్రులను హింసించడానికి కొత్తకొత్త చట్టాలు క్రియేట్ చేయడానికి అవకాశం లేదు.  

 9. హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగాల విషయంలో  సీమాంధ్రులను అనాథలు చేసే అవకాశం వుండదు. ఈ విషయంలో సీమాంధ్రులు, తెలంగాణవాళ్ళు అనే తేడా వుండదు. అందరూ సమానమే.

10.  యు.టి. అయితే కబ్జాలు కుదరవు. కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు తప్పనిసరిగా చెల్లించాలి.

11.  యు.టి.కి ఒప్పుకుంటే తెలంగాణ విభజనకు అడ్డంకులు వుండవు. తెలంగాణ సమస్య పరిష్కారమైపోతుంది. విభజనులకు, ఉద్యమాలు చేసేవాళ్ళకు పని వుండదు.

.... ఇవి కాక ఇలాంటి నష్టాలు ఇంకా బోలెడన్ని వున్నాయి. అందుకే యు.టి. వద్దంటారు!