TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్-ఇవాంక రోడ్డు.. స్థానికుల నిరసన..

Published on: Tue May 1, 2018 4:06PM

 

కేటీఆర్-ఇవాంక రోడ్డు.. ఇదేం రోడ్డు అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చాలా అద్వానంగా తయారైన సంగతి తెలిసిందే. ఇక స్థానికులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారే లేదు. అధికారులేమో నిర్లక్ష్యపు సమాధానాలివ్వడంతో.. విసిగిపోయిన జనాలు ఆ కోపంలో తమ దారి తామే చూ(వే)సుకున్నరు. మారేడ్‌పల్లి ప్రాంతంలో గతుకుల రోడ్లను తమంత తామే బాగు చేసుకున్నారు స్థానికులు. అంతేకాదు దీనికి కేటీఆర్-ఇవాంక రోడ్డు అని కూడా పేరు పెట్టారు. గతేడాది ఇవాంక ట్రంప్‌-ప్రధాని మోదీ రాకల సందర్భంగా నగరానికి మరమ్మత్తులు జరిగింది తెలిసిందే. ఆ సమయంలో జీహెచ్‌ఎంసీకి పలువురు స్థానికులు మళ్లీ విజ్ఞప్తులు చేశారు. బదులుగా ‘ఆమె(ఇవాంక) మీ ప్రాంతంలోకి రావట్లేదు కదా’ అన్న నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు... అప్పట్లో  ‘ఇవాంక ఈ వంక రావమ్మా!’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు కూడా చేశారు. దీంతో దీంతో ప్రజలే రంగంలోకి దిగి.. తమ రోడ్లను తామే బాగుచేసుకున్నారు. ప్రభుత్వం, అధికారుల తీరుకు నిరసనగా తాము ఈ పని చేసినట్లు వారు చెబుతున్నారు. ‘కేటీఆర్‌-ఇవాంక ట్రంప్‌ రోడ్డు’ అని నామకరణం చేసినట్లు ఫ్లకార్డులను ప్రదర్శించారు.