TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రియల్టర్లకు కోట్లు కురిపిస్తున్న 'రింగ్'లు

Published on: Sat Apr 28, 2012 10:06AM

హైదరాబాద్ రింగ్ రోడ్డు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. హైదరాబాద్ సిటీ రింగ్ రోడ్లు ఏర్పాట్లలో భాగంగా 290కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ప్రాంతాల వివరాలను అధికార్ల నుంచి ముందుగానే తెలుసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుట్టుగా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు భారీ లే-అవుట్లతో మార్కెట్లోకి వస్తున్నారు. హెచ్.ఎం.డి.ఎ.ఐబిఎల్ 695 చదరపు కోలోమీటర్ల విస్తరిత ప్రాంతానికి మాస్టర్-2031 ప్లాను రూపొందించింది.

 

 

ఈ ప్లానులో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు అర్బన్ రోడ్స్ ను అర్బన్ సెంటర్లను కలుపుతూ 290 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. అధికార్లతో కుమ్ముక్కైన రియల్టర్లు ముందుగానే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్గాన్ని తెలుసుకున్నారు. కారుచౌకగా భూమిని కొనుగోలు చేశారు పనికిరాని భూముల్లో భారీవెంచర్లు వేసి అమాయకప్రజలను దోచుకోవటానికి సిద్ధపడుతున్నారు. ఈ రహదారి ప్రణాళిక ఇంకా కాగితాల్లోనే ఉండి. ఇది వస్తుందో లేదో కూడా తెలియదు. నిజానికి ఇది కార్యరూపం దాల్చాలంటే 30ఏళ్ళు పట్టే అవకాశం ఉండి. గతంలో అవుటర్ పరిసరాల్లో స్థలాలు కొనుగోలు చేసిన వారు వాటిని తిరిగి అమ్మేందుకు సిద్ధమైనా కొనుగోలు చేసిన ధరలు కూడా రావటం లేదు.

 

నగర సమీపంలోని 158 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు కార్యరూపం దాల్చేందుకు 20 ఏళ్ళు పట్టింది. అప్పుడు కూడా ఈ రింగ్ రోడ్డును ఆకర్షనీయంగా చూపించి వందలాది వెంచర్లు వేశారు. ఈ వెంచర్లలో భూములు కొన్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోట్లాదిరూపాయలు నష్టపోయారు. ఇప్పుడు ఆ భూములను గుర్తించటం కూడా కొనుగోలుదారులకు కష్టంగా మారింది. వీటిని తిరిగి విక్రయిద్దామనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది. వాటిని కొనటానికి ఎవరూ ముందుకురావటం లేదు. ఇదే పరిస్థితి కొత్తగా వేస్తున్న వెంచర్లకు వస్తుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.