పోలీసుల వింత రూల్స్.. న్యూ ఇయర్ వేడుకలకు ట్విస్ట్
Published on: Wed Dec 29, 2021 4:58PM
ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దానికి అనుగుణంగా పోలీసులు గైడ్ లైన్స్ విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. తెల్లవారుఝామున ఒంటిగంట వరకు పబ్బులకు అనుమతి ఇచ్చారు. ఈవెంట్ కు రెండు రోజుల ముందు పోలీసులు అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేస్తూ పబ్ లకు పోలీసుల గైడ్ లైన్స్ ఇచ్చారు.
న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల నిబంధనలు ఇవే..
పబ్బుల్లో భౌతిక దూరం తప్పనిసరి
మాస్క్ లేని వ్యక్తులకు అనుమతి నిరాకరణ
ఈవెంట్ ఎంట్రీ పాయింట్ వద్ద థర్మల్ స్కానర్ ఏర్పాటు తప్పనిసరి
వాక్సినేషన్ రెండు డోసులు సర్టిఫికెట్ చూపని వ్యక్తులకు అనుమతి నిరాకరణ
కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో మోతాదుకు మించి పాసులు అమ్మ రాదు
బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించనీ వ్యక్తులకు వెయ్యి రూపాయలు జరిమానా
పబ్లిక్ ఎక్కువగా వచ్చే ఈవెంట్లకు అధిక సిబ్బందిని పెట్టాలని సూచన
ఈవెంట్ నిర్వాహకులు, సిబ్బంది తప్ప్పనిసరిగా 48 గంటల ముందు టెస్ట్ చేయించుకున్న నెగిటివ్ రిపోర్ట్ చూపించాలి
ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద శానిటైజర్ తప్పనిసరి
ఈవెంట్ కు ముందు మొత్తాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాలి
అవుట్ డోర్ ఈవెంట్లలో డీజే నిషేధం
మ్యూజికల్ ఈవెంట్ శబ్దం ప్రిన్సెస్ దాటి బయటికి వినపడకూడదు.
శబ్ద కాలుష్యం పై స్థానికులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవు
సౌండ్ లెవెల్ 45 డెసిబుల్స్ ను మించరాదు
ఈవెంట్లలో పాల్గొనే సింగర్లు క్రౌడ్ మధ్యలోకి వెళ్లరాదు
ఈవెంట్లలలో అసభ్యకర దుస్తులు, అసభ్యకర డాన్సులు నిషేధించాలి
ఈవెంట్ లో డ్రగ్స్ వాడకం పూర్తిగా నిషేధం
పార్కింగ్ ఏరియా లో పై ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
పార్కింగ్ ఏరియా లో డ్రగ్స్ అమ్మకంపై ఆర్గనైజర్లు నిఘా పెట్టాలి
ప్రతి ఎంట్రీ,ఎక్సైట్ వద్ద రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి
పార్కింగ్ ప్లేస్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి.
పబ్ లో న్యూసెన్స్, వస్తువులు డ్యామేజ్ చేస్తే చర్యలు తప్పవు
పోలీసులు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని ఈవెంట్ ఆర్గనైజర్లు తూచా తప్పకుండా పాటించాల్సిందే
అనుమతి సమయానికి మించి మద్యం సరఫరా చేయరాదు
కపుల్స్ ఈవెంట్లకు మైనర్ల కు అనుమతి నిషేధం
ఈవెంట్ పబ్లిసిటీ నిషేధం
ఈవెంట్ వద్ద బాణసంచా కాల్చడం నిషేధం
నిబంధనలు పాటించకుంటే లైసెన్స్ రద్దు చేస్తాం
బార్లు రెస్టారెంట్లలో లైవ్ బ్యాండ్ నిషేధం
ఈవెంట్ కు వచ్చే వారి వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించే బాధ్యత నిర్వాహకులు
మెయిన్ రోడ్డు పై వాహనాలను నిలుపరాదు
ఎంట్రీ,ఎక్సైట్ పాయింట్లకు వేరు వేరు గేట్లు ఏర్పాటు చేయాలి
మద్యం సేవించిన వారికి డ్రైవర్లను ఏర్పాటు చేసే బాధ్యత ఆర్గనైజర్లదే
తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేస్తాం
తాగి వాహనం నడిపిన వ్యక్తి తో పాటు లైసెన్స్ ఉన్న మరో వ్యక్తి ఉంటే వాహనం ఇచ్చేస్తాం
లేనిపక్షంలో టెంపరరీ కస్టడీలో వాహనం పోలీస్స్టేషన్ కు తరలిస్తo
మరుసటి రోజు వర్జినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి చూపించి వాహనం తీసుకెళ్లొచ్చు
తాగి వాహనం నడిపితే పదివేల పెనాల్టీ తో పాటు ఆరు నెలల జైలు శిక్ష
తాగి వాహనం నడిపితే మూడునెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్
మైనర్లకు ఎట్టిపరిస్థితిలో వాహనం ఇవ్వరాదు
ఓవర్ స్పీడ్ ,డేంజరస్ డ్రైవింగ్ చేస్తే ఎంవి యాక్ట్ కింద కేసు బుక్
మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పై ఎప్పటికప్పుడు షీటీమ్స్ నిఘా


