TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణం

Published on: Fri Aug 29, 2014 8:23AM

 

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఘోరం జరిగింది. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పొందుతున్న మను ముక్తి మానవ్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం పోలీస్ అకాడమీ ఆవరణలోని ఈత కొలనులో ఈత కొడుతున్న మను ముక్తి మానవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీస్ అకాడమీ అధికారులు మను ముక్తి మానవ్ వెంటనే బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మను ముక్తి మానవ్ మరణించాడు. మను ముక్తి మానవ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఐపీఎస్‌కి సెలక్టయ్యాడు.