వివాదాస్పదమౌతున్న బీఆర్ఎస్ ఫేస్ బుక్
Published on: Sat Apr 15, 2023 5:00PM
హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం. ప్రపంచంలో ఎక్కడ మతకలహాలు జరిగినా దాని ప్రభావం హైదరాబాద్ నగరంపై పడుతుంది. భారతీయ జనతాపార్టీ, సంఘ్ పరివార్ హైదరాబాద్ ను భాగ్యనగరం అని సంభోధిస్తుంటాయి. సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ వాదులు హైదరాబాద్ ను భాగ్యనగరం అని పిలవడాన్ని ఖండిస్తున్నారు. అయితే ప్ర స్తుతం భారతీయ జనతా పార్టీ సరసన బీఆర్ ఎస్ చేరినట్టే కనబడుతుంది. హిందూ వోటర్లను ఆకర్షించడానికి బీఆర్ఎస్ హైద్రాబాద్ ను తమ ఫేస్ బుక్ లో భాగ్యనగరం అని రాసుకొచ్చింది. మజ్లి స్ పార్టీతో చెట్ట పట్టాల్ వేసుకుని తిరిగే బీఆర్ఎస్ భాగ్యనగరం అనే పల్లవి ఎత్తుకోవడాన్ని చాలామంది నిరసిస్తున్నారు.
మజ్లిస్ బచావో తహరీక్ నేత అమ్జదుల్లా ఖాన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. బీజేపీ బాటలో బీఆర్ఎస్ వెళుతుందని దుయ్యబట్టారు.హిందూ వోటర్లను ఆకర్షించడానికి ఈ విధంగా ప్రచారం చేస్తుందన్నారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా బీఆర్ఎస్ తన సోషల్ మీడియా అకౌంట్లో హైదరాబాద్ ను భాగ్యనగరం అని సంభోధించడం విడ్డూరమన్నారు. హైదరాబాద్ ను భాగ్యనగరం అని చరిత్ర పుటల్లో కూడా లేదని లౌకికవాదులు చెబుతున్నారు.


