TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్తవి కాదు ముందు  ఉస్మానియా బిల్డింగ్ కట్టండి! కేసీఆర్ కు అసద్ ఝలక్.. 

Published on: Mon Jun 21, 2021 1:41PM

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా చెప్పుకునే ఎంఐఎం పార్టీకి స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు అసద్. 

ఉస్మానియా హాస్పిటల్ లో సూపరింటెండెంట్ తో సోమవారం సమావేశమయ్యారు MIM నేతలు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తో సహా  గ్రేటర్ పరిధిలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా హాస్పిటల్ పాత భవనం కుల్చకుండా... రెన్యూవేషన్ అంశం పై చర్చించారు. ఉస్మానియా సూపరింటెండెంట్ తో చర్చల తర్వాత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

గ్రేటర్ పరిధిలో కొత్తగా 3 హాస్పిటల్స్  కడతామని కేసీఆర్ ప్రకటన చేశారన్న అసద్.. వాటి కంటే ముందు ఉస్మానియ హాస్పిటల్ ను బాగు చెయ్యాలని కోరారు. ప్రస్తుతం ఉస్మానియాలో సరైన వసతులు లేకున్నా
డాక్టర్స్ గ్రేట్ హ్యూమన్ సర్వీస్ ఇస్తున్నారని తెలిపారు.   న్యూ ఇన్ పేషంట్స్, ఔట్ పేషెంట్,  న్యూ ఏమర్జెని బిల్దింగ్స్ కట్టించాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కు వెంటనే కొత్త భనాలు  కట్టించాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు.

పాత భవనంలో గతంలో 6 వందల బెడ్స్ ఉండేవని.. బిల్డింగ్ క్లోజ్ చేయడంతో ప్రస్తుతం రోగులకు ఇబ్బందిగా ఉందన్నారు హైదరాాబాద్ ఎంపీ. కర్నాటక, మహారాష్ట్ర  నుంచి కూడా ఉస్మానియాకు రోగులు వస్తున్నారని అసద్ తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ లో 35 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం అందుబాటులో ఉందన్న అసద్.. వెంటనే కొత్త నిర్మాణాల కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ వల్ల ఓల్డ్ సిటీలో వేలాదిమంది చనిపోయారని చెప్పారు.

హెరిటేజ్ బిల్డింగ్ గురించి చర్చ అనవసరమన్నారు అసద్. మిషన్ భగీరథ మీద వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. ప్రాణాల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యరా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు .  పాత బిల్డింగ్ ను కుల్చాలంటే కూల్చేయండని చెప్పారు. అందుకు తాము అభ్యంతరం చెప్పమని.. తమకు వెంటనే కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.