అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్ మెట్రోలోనే అత్యంత కీలక స్టేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ సాయంతో స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ మెట్రోను నిర్మించారు. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలిసిపోయే నిఘా వ్యవస్థ. ఇంతటి పటిష్టమైన వ్యవస్థ ఉన్న మెట్రోలో బాంబు ఎలా పెట్టారు...? ఇది ఆకతాయి పనా..? లేదంటే ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల పనా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోను నవంబర్ 28న ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. 29 నుంచి ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు.