TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ మెట్రో... 250 కిలోమీటర్లు.. సూపర్

Published on: Sat Aug 2, 2014 10:35AM

 

హైదరాబాద్‌ మెట్రో రైలును 250 కిలోమీటర్ల మేరకు విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించడం హైదరాబాద్‌ ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ ప్రజలతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం మెట్రో రైలు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే బాగా విస్తరించి వుంది. హెచ్ఎండీఏ పరిధికి కూడా విస్తరిస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్ మహానగరానికి రావడం మరింత సులభం అవుతుందని అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలుకి కోఠీ దగ్గర భూగర్భ మార్గం వేయాలి, అసెంబ్లీ దగ్గర మార్గం మార్చాలి, భూగర్భంలోంచి వెళ్ళాలి అనే డిమాండ్లు పెట్టకుండా వుంటే సాధ్యమైనంత త్వరగా మెట్రో రైలు తెలంగాణ బిడ్డలకి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.