హైదరాబాద్... గణేశ నిమజ్జనానికి సర్వం సిద్ధం
Published on: Sun Sep 7, 2014 2:31PM

హైదరాబాద్‌లో గత తొమ్మది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న గణేశుడు ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ప్రతి యేటా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరిగే నిమజ్జనోత్సవ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు తలమునకలై ఉన్నారు. 30 వేల మంది పోలీసులతో నిమజ్జనానికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 40 క్రేన్లు, 71 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారి సౌకర్యార్థం ఆర్టీసీ, రైల్వే శాఖలు భారీగా ఏర్పాట్లు చేశాయి.


