ఐటీలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం
Published on: Sun Sep 14, 2014 1:41PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత ఎంతమాత్రం తగ్గవన్న అభిప్రాయాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో తన శాఖ 100 రోజుల పాలన ప్రగతి నివేదికను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. ఇద్దరూ ఐటీపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కోరారు. వాటిపై దృష్టిపెడతాం..’ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారని, దీనిపై మీ స్పందనేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా ‘పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం. అందరూ పత్రికా స్వేచ్ఛకు విలువనివ్వాలి’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.


