TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోకుల్ చాట్ యజమానికి కరోనా.. క‌స్ట‌మ‌ర్ల‌లో ఆందోళన

Published on: Tue Jun 16, 2020 4:12PM

హైదరాబాద్‌లోని కోఠిలో కరోనా కలకలం రేగింది. గోకుల్ చాట్ యజమానికి కరోనా సోకింది. ఈ వయస్సు 70 సంవత్సరాలు. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు, యజమాని కుటుంబ సభ్యులతో పాటు 20 మంది గోకుల్ చాట్ సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత రెండు మూడు రోజులుగా షాప్‌కు ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

కాగా, హైదరాబాద్‌లో గోకుల్ చాలా ఫేమస్. నిత్యం క‌స్ట‌మ‌ర్ల‌తో కిట‌కిట‌లాడుతుంటుంది. ఇక, సాయంత్రమైతే రద్దీ మామూలుగా ఉండదు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్‌లో హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడంతో గోకుల్ చాట్ కూడా ఓపెన్ చేశారు. అయితే, గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో క‌స్ట‌మ‌ర్ల‌లో ఆందోళన మొదలైంది.