కొత్త మేయర్ కు అప్పుడే షాక్..
Published on: Sat Feb 13, 2021 3:48PM
హైదరాబాద్ నూతన మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి సీట్లో కూర్చొని రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే షాక్ తగిలింది.. అధికారులు ఆమెకు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జీహెచ్‌ఎంసీ షాకిచ్చింది. ఈ నెల 11న గ్రేటర్ మేయర్‌గా విజయలక్ష్మి కి , శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె అనుచరుడు అతిష్ అగర్వాల్.. నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నగర పౌరుడు ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఫ్లెక్సీలు అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సదరు విజయలక్ష్మి అనుచరుడు అతిష్ అగర్వాల్‌పై అధికారులు కొరడా ఝళిపించింది. అతిష్ అగర్వాల్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు షాకిచ్చారు. జీహెచ్‌ఎంసీ అధికారుల జరిమానా పై కొత్త మేయర్ అనుచరుడు అతిష్ అగర్వాల్ తో పాటు కొత్త మేయర్ విజయలక్ష్మి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు..


