TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాహనదారులకు హైదరాబాద్ సీపీ కీలక సూచనలు

Published on: Tue Jun 16, 2026 3:24PM

 

హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు పోలీసు శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ట్రాఫిక్ ఉల్లం ఘనలకు సంబంధించిన ఈ-చలానాలు, ఇతర కీలక నోటిఫికేషన్లు, వాహన సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా మరియు సకాలంలో పొందేందుకు ప్రతి వాహన యజమాని తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను 'వాహన్' పోర్టల్‌లో తప్పని సరిగా అప్‌డేట్ చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వాహన యజమానులు తమ సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేసుకుంటే ట్రాఫిక్ చలానాలు, వాహనానికి సంబంధించిన ఇతర అధి కారిక సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో నోటిఫికేషన్లు అందకపోవ డం వల్ల చలానాల చెల్లింపులో జాప్యం జరిగి అద నపు జరిమానాలు విధించే పరిస్థితులను నివారించ వచ్చు. వాహనదారులు తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను vahan.parivahan.gov.in ద్వారా లేదా పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 'వాహన్' పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన ఈ-చలానాలు, నోటీసులు వాహన యజ మానికి అధికారికంగా అందినట్లుగానే పరిగణి స్తారు. అందువల్ల వివరాలు పాతవిగా ఉండటం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల కలిగే ఇబ్బందులకు వాహన యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ కాంటాక్ట్ వివరాలను నవీకరించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనవసర జరిమానాల బారిన పడ కుండా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.