TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బోనాల భద్రతకు పటిష్ఠ బందోబస్తు.. 2,400 మంది పోలీసులతో నిరంతర నిఘా..!

Published on: Sun Aug 9, 2026 4:49PM

 

 ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నగర పోలీస్‌ కమిషనర్‌  వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ఆలయ పరిసరా ల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పురస్కరిం చుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకా రంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

శాంతిభద్రతల పరిరక్షణలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని సీపీ తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.భద్రతా విధుల కోసం 2,400 మంది పోలీసు సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్‌లు, క్రైమ్‌ టీమ్‌లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆలయ ప్రాంగణాలతో పాటు బోనాల ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు లాల్‌దర్వాజా యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

Hyderabad Bonalu, Laldarwaja Mahankali Temple, Ashadha Bonalu Jatara, Minister Seethakka, Telangana Spiritual News, Commissioner VC Sajjanar, She-teams, crime team