పేలుళ్ళకు వాడిన బాంబులు ఇక్కడ చేసినవె

 

 

hyderabad bomb blast, hyderabad bomb blast news, bomb blast hyderabd,telugu political news

 

 

హైదరాబాద్ లో జంట పేలుళ్లకు ఉగ్రవాదులు వాడిన బాంబులు ఇక్కడ తాయారు చేసినవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిపుణులు నిర్ధారించారు. పేలుళ్ల అనంతరం సంఘటనా స్థలంలో సేకరించిన ఆనవాళ్లు, నమూనాలు ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఈ మేరకు నివేదిక ఇచ్చారు.


బాంబు తయారీకి అమ్మోనియం నైట్రేట్‌ని, కిలోన్నర దాకా ఈ పేలుడు పదార్థాన్ని ఉపయోగించారట.  బాంబుకు దాదాపు 15 వాట్ల పవర్‌ను ఉపయోగించారు. దానికి ఒక డిజిటల్ డిలే టైమర్‌ను అమర్చారు. టైమర్ పనిచేయడానికి, డిటోనేటర్ పేలడానికి పవర్‌ను అందించేందుకు ఒక స్విచ్‌ను ఏర్పాటు చేశారు. స్విచ్ ఆన్‌చేయగానే నిమిషం వ్యవధిలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే పేలేలా టైమ్ సెట్‌చేశారు.

ఇక బాంబు పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండేందుకు ఒక ప్లెక్సీ క్లాత్‌లో భారీగా మేకులు, గుండుసుదులు ఉంచి బాంబు చుట్టూ కట్టారు. సైకిల్ వెనుక ఉండే స్టాండ్‌లో ఈ బాంబును అమర్చారు. బాంబు కనపడకుండా మరో రెగ్జిన్ కవర్‌ను చుట్టారు. బాంబ్ పేల్చినా వారు సమీపంలో వున్నవారినే కాకుండ దూరంగా వున్న వారిని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.  

బాంబు ఒకటి పేలిన వెంటనే సమీపంలో ఉన్న వారు మరణించడమో, గాయపడటమో జరుగుతుంది. మిగినవారు ప్రాణభయంతో   పరుగులు తీస్తారు. కొంచెం దూరంలో ఉన్న ప్రజలు ఏం జరిగిందన్న ఆత్రుతతో అక్కడి నుంచి చూస్తారు. అలా వచ్చి చూసేవారిని కూడా టార్గెట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలన్నిటి పై ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక అందించనున్నారు.