TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెట్రో రైల్ వార్తలు మీడియా చలవేనట

Published on: Wed Sep 17, 2014 5:08PM

 

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే దానిపై అధికార తెరాస ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు మొదలయ్యాయి. దానితో వెంటనే మేల్కొన్న తెలంగాణా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్పట్టి, సంబంధిత వ్యక్తులందరి చేత ఖండనలు చేయించింది. మెట్రో పనులలో అడ్డంకులు ఏర్పడటం, దానిపై తాము లేఖలు వ్రాసుకోవడం అన్నీ నిజమే కానీ, ప్రభుత్వంతో తమకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని, ప్రభుత్వ సహకారంతోనే తాము అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, అదేవిధంగా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి తీరుతామని ఈ లేఖ వ్రాసినట్లుగా చెప్పబడిన యల్.యండ్.టీ. మేనేజింగ్ డైరెక్టర్ గాడ్గిల్ సంజాయిషీతో “జబ్ మియా బీబీ హోగయా రాజీ క్యా కరేగా ఖాజీ?”(మొగుడు పెళ్ళాలు రాజీ పడిపోయేక ఖాజీ (ముస్లిం పురోహితుడు) మాత్రం ఏమి చేస్తాడు?) అనే నానుడి ఊరికే పుట్టలేదని ఈరోజు మరోసారి రుజువయింది. తరువాత ప్రాజెక్టు రెండవ దశ పనులు మొదలు పెట్టేందుకు సంబంధిత అధికారులను తక్షణమే డిల్లీ పంపించి మెట్రో గురువుగా పేరొందిన శ్రీధరన్ నుండి అవసరమయిన సలహాలు తీసుకోబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం, సదరు సంస్థ రెండూ కూడా తమ మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ఇదంతా మీడియా సృష్టేనని తేల్చి పడేశాయి. ఒకటి రెండు పత్రికలు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఉద్దేశ్య పూర్వకంగా లేఖలో కొంత భాగం మాత్రమే ప్రచురించాయని ప్రభుత్వం ఆరోపించింది.