హైదరాబాద్‌లోనే డీజిల్‌ రేట్‌ ఎక్కువ

 

పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల గురించి జనం బెంగపడటం కొత్తేమీ కాదు. కానీ ఈ విషయంలో హైదరాబాద్‌దే పైచేయిగా ఉండటం కాస్త బాధపడాల్సిన విషయమే! హైదరాబాదులో ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధర 73.45 రూపాయలుంది. త్రివేండ్రం, భువనేశ్వర్‌లాంటి ఇతర ప్రదేశాల్లో పోల్చుకుంటే మన దగ్గరే డీజిల్‌ ఎక్కవ రేటు పలుకుతోంది. లోకల్‌ టాక్సెస్‌ ఎక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. మరి ప్రజల సమస్యలకి తక్షణమే స్పందించే తెరాస సర్కారు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు కేంద్ర సర్కారు కూడా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల విషయమై కాస్త వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ టాక్స్‌ తగ్గించడం వల్ల పెట్రోల్ భారం తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.