కారులో గ్యాస్‌ లీక్‌ చేసుకొని ఆత్మహత్య..


హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు  ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్‌ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్‌ ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ బిగించుకుని.. ఆపై కారులోని గ్యాస్‌ లీక్‌ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పార్క్‌ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతని వద్ద నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.