బెజవాడ వరకు దింపుతామని..ఆత్యాచారయత్నం
Published on: Fri Mar 3, 2017 9:13AM

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. విజయవాడ వరకు దింపుతామని చెప్పి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై అత్యాచారయత్నానికి దిగారు కొందరు యువకులు. ఆమె అరుపులతో స్థానికులు అప్రమత్తం కావడంతో యువకులు పరారయ్యారు. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న గుంటూరుకు చెందిన యువతి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఎల్బీనగర్ చౌరస్తాలో వేచి ఉంది. అదే సమయంలో విజయవాడ వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ తన కార్లో ఓ సీటు ఖాళీగా ఉందని చెప్పి యువతిని ఎక్కించుకున్నాడు.
అప్పటికే కారులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్‌గేట్ దాటాకా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. ఆమె అరుపులు విన్న స్థానికులు కారును ఆపేందుకు యత్నించగా, యువతిని అక్కడే వదిలి ఇద్దరూ కారుతో సహా పరారయ్యారు. దీనిపై బాధితురాలు చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్ ఆచూకీ కనిపెట్టి మౌలాలికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేశారు.


