మందు బాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ బంద్

posted on: Jul 10, 2025 6:18PM

 

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్బంగా హైదరాబాద్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నార్త్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం దుకాణాలు ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.బోనాల పండగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...