Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కల్లును సేవించిన మిస్ వరల్డ్-2025 పోటీదారులు
posted on: May 11, 2025 6:00PM

హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలను సీఎం రేవంత్‌రెడ్డిచేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు.
ఈ నెలాఖరు వరకు జరిగే అందల పోటీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. అయితే ఈ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్లు తాగారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే ఈ నీరా కల్లు సేవించి... చాలా ఎంజాయ్ చేశారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



.webp)


